రుపే కార్డుతో జాకెట్‌ కొనుగోలు చేసిన ప్రధాని | Sakshi
Sakshi News home page

రుపే కార్డుతో జాకెట్‌ కొనుగోలు చేసిన ప్రధాని

Published Thu, Jan 17 2019 8:40 PM

Modi Purchases Jacket At Amdavad Shopping Festival - Sakshi

అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో జాకెట్‌ను కొనుగోలు చేసి తన రుపే కార్డు ద్వారా చెల్లింపులు జరిపారు. షాపింగ్‌ ఫెస్టివల్‌లో కలియతిరిగిన ప్రధాని తనకు ఇష్టమైన ఖాదీ జాకెట్లను విక్రయించే కేవీఐబీ స్టాల్‌ వద్ద ఆగారు. తాను నిత్యం ధరించే జాకెట్‌ను ఆ స్టాల్‌లో నుంచి ఒకటి ఎంపిక చేసుకుని నేరుగా రుపే డెబిట్‌ కార్డు ద్వారా డిజిటల్‌ పద్ధతిలో బిల్లు చెల్లించారు.

ఏటా జరిగే వైబ్రాంట్‌ గుజరాత్‌లో భాగంగా అహ్మదాబాద్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను గుజరాత్‌ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు తమ ఉత్పత్తులతో ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 12 రోజుల పాటు జరిగే ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో 15,000 మంది దుకాణదారులు, విక్రేతలు, తయారీదారులు పాల్గొని తమ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతారు. పలు ఉత్పత్తులపై 60 శాతం వరకూ డిస్కాంట్లను వారు ఆఫర్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement