నెహ్రూకు నరేంద్ర మోదీ ఘన నివాళి | Modi offers tribute to Jawaharlal Nehru | Sakshi
Sakshi News home page

నెహ్రూకు నరేంద్ర మోదీ ఘన నివాళి

Nov 14 2014 10:47 AM | Updated on Aug 15 2018 2:20 PM

నెహ్రూకు నరేంద్ర మోదీ ఘన నివాళి - Sakshi

నెహ్రూకు నరేంద్ర మోదీ ఘన నివాళి

భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.

బ్రిస్బెన్: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.  అలాగే స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి గణనీయమైన సేవలందించారని నెహ్రూపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరానికి చేరుకున్నారు. అంతకుముందు మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగిన ఆసియన్ తూర్పు ఆసియా దేశాల సదస్సులో మోదీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement