పొరపాటు సరిదిద్దుకున్న మోదీ | Modi greets Afghan President on birthday, this time correctly | Sakshi
Sakshi News home page

పొరపాటు సరిదిద్దుకున్న మోదీ

May 19 2016 8:00 PM | Updated on Mar 28 2019 6:08 PM

పొరపాటు సరిదిద్దుకున్న మోదీ - Sakshi

పొరపాటు సరిదిద్దుకున్న మోదీ

గతంలో పొరబడి ముందస్తుగానే అప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారి సరైన సమయంలో శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: గతంలో పొరబడి ముందస్తుగానే అప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారి సరైన సమయంలో శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ.. ఈసారి సరైన సమయంలో మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను' అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు స్పందనగా.. ఆయన స్పందిస్తూ మీకు ధన్యవాదాలు ప్రధాని మోదీ. నాకు మీలాంటి ప్రియమైన మిత్రుడు ఉండటం.. నాకు నా దేశ ప్రజలకు నిత్యం మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు' అంటూ చెప్పారు. గతంలో ఫిబ్రవరి 12న మోదీ పొరపాటున ఘనీకి ముందస్తుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దానికి అప్పుడు స్పందించిన ఘనీ.. నా పుట్టిన రోజు మే 19న.. అయినప్పటికీ మీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ అప్పుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement