పాన్‌ మసాలా ఇవ్వలేదని కొట్టిచంపారు.. | Mob Beats Man To Death For Refusing To Give Pan Masala | Sakshi
Sakshi News home page

పాన్‌ మసాలా ఇవ్వలేదని కొట్టిచంపారు..

Oct 4 2018 10:57 AM | Updated on Oct 4 2018 11:09 AM

Mob Beats Man To Death For Refusing To Give Pan Masala - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సీనియర్‌ సిటిజన్‌పై మూక దాడి..ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన సీనియర్‌ సిటిజన్‌

లక్నో: దేశవ్యాప్తంగా మూక దాడులు  కొనసాగుతున్నాయి. పాన్‌ మసాలా ఇచ్చేందుకు నిరాకరించిన 60 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌పై స్ధానికులు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అప్పుపై పాన్‌ మసాలా ఇవ్వలేదనే కోపంతో వారు వృద్ధుడిని కొట్టి చంపారు. యూపీలోని హర్దోయ్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

మూక దాడిలో బాధితుడు ఘటనా ప్రదేశంలోనే మరణించాడని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్‌పీ శైలేంద్ర సింగ్‌ తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో జనసమ్మర్ధ కన్నాట్‌ప్లేస్‌లో సిగరెట్లు ఇవ్వలేదని ఇద్దరు యువకులపై అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. మూక దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement