ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్న ఓ ఆకతాయి.. ఆమెను కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది.
సీతాపూర్: ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్న ఓ ఆకతాయి.. ఆమెను కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకడు పరారీలో ఉన్నాడు. యూపీలోని సీతాపూర్‌లో ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది 15 ఏళ్ల ప్రింకీ. ఆమెను కుల్‌దీప్ తరచూ వెంటపడి వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో మంగళవారం ప్రింకి తన చెల్లెలితో కలిసి ఇంటికి వస్తుండగా.. మాటువేసిన కులదీప్, అతని ఇద్దరు స్నేహితులు పుజారీ, లోకేష్ వాళ్లను అడ్డగించారు. ఈసారి కూడా బాలికను మళ్లీ వేధించిన కులదీప్.. ఏకంగా ఆమెను తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చాడు. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ప్రింకీ సోదరి, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కులదీప్, పుజారీలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లోకేష్ కోసం గాలిస్తున్నారు.