కరోనా వ్యాక్సిన్‌ : ప్రకటనలో గందరగోళం

Ministry of Science Removed Its Statement On Corona Vaccine Availability - Sakshi

న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో గందగోళం చోటుచేసుకుంది. తొలుత సదరు మంత్రిత్వ శాఖ పేరిట పీఐబీలో ఒక ప్రకటన కనిపించింది. అందులో ‘కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై 6 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. భారత్‌కు చెందిన ‘కోవాక్సిన్‌’,  'జైకోవ్‌- డీ'లతోపాటుగా ప్రపంచంలోని 140 వ్యాక్సిన్లలో 11 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇందులో ఏది కూడా 2021 కన్నా ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ‘2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అనే లైన్‌ను తొలగించారు. (చదవండి : కోవిడ్‌-19 టీకా: ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన)

మరోవైపు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని ఐసీఎంఆర్‌ పేర్కొంది. అయితే దీనిపై వైద్య నిపుణలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వ్యాక్సిన్‌కు సంబంధించి తేదీని నిర్ణయించారనే పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనపై ఐసీఎంఆర్‌ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు తెలిపింది.దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని​ వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.(చదవండి : కరోనా ‘కోవాక్సిన్‌’పై కొత్త గొడవ)

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్’‌,  ఫార్మా సంస్థ జైడస్ తయారు చేసిన ‘జైకోవ్- డి’ ల క్లినికల్‌ ట్రయల్స్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఏ) అనుమతించిన సంగతి తెలిసిందే. క్లినికల్‌ ట్రయల్స్ తొలి దశలో భద్రతపై దృష్టి సారించగా, రెండో దశలో వ్యాక్సిన్‌ సమర్ధతను పరీక్షించనున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. (చదవండి : ‘కోవాక్సిన్​’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-08-2020
Aug 04, 2020, 15:56 IST
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19...
04-08-2020
Aug 04, 2020, 14:32 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే...
04-08-2020
Aug 04, 2020, 13:33 IST
సాక్షి, ఢిల్లీ : చైనాలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు గురించి ముందుగానే అధికారులను హెచ్చరించడంతో పాటు కరోనా సోకిన అనేక...
04-08-2020
Aug 04, 2020, 12:36 IST
న్యూఢిల్లీ: మహమ్మారి క‌రోనా వ్యాపించిన తొలి నాళ్లలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసుల నమోదైన దేశ రాజధానిలో వైరస్‌ తీవ్రత...
04-08-2020
Aug 04, 2020, 11:35 IST
సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు...
04-08-2020
Aug 04, 2020, 10:47 IST
కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్‌–19 పోషించే విలన్‌ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.....
04-08-2020
Aug 04, 2020, 10:18 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా వైరస్‌కు  సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.  భారత్ లో...
04-08-2020
Aug 04, 2020, 09:38 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24గంటల్లో 13,787 శాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 1286 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర...
04-08-2020
Aug 04, 2020, 09:37 IST
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి  నివాసంలో కరోనా వైరస్ కలకలం  రేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్  కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు...
04-08-2020
Aug 04, 2020, 09:31 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక...
04-08-2020
Aug 04, 2020, 09:08 IST
సాక్షి, హైదరాబాద్ ‌: బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో...
04-08-2020
Aug 04, 2020, 09:08 IST
నెల్లూరు(అర్బన్‌): కోవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుకు స్పందించిన ఓ డాక్టర్‌ ప్లాస్మా...
04-08-2020
Aug 04, 2020, 09:02 IST
ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా గుప్పెట్లో ఉంటూ...
04-08-2020
Aug 04, 2020, 08:56 IST
మేడ్చల్‌: నగర శివార్లలోని మేడ్చల్‌ నియోజకవర్గంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో పాజిటివ్‌ కేసులు పెద్దగా బయటపడకపోగా.. ప్రస్తుతం...
04-08-2020
Aug 04, 2020, 08:49 IST
సాక్షి, బెంగళూరు : కరోనా మహమ్మారి కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కరోనా బారిన పడగా, తాజాగా కాంగ్రెస్...
04-08-2020
Aug 04, 2020, 08:37 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ...
04-08-2020
Aug 04, 2020, 08:33 IST
అగ‌ర్త‌లా: తమ కుటుంబ స‌భ్యుల్లో ఇద్ద‌రికి క‌రోనా సోక‌డంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్న‌ట్లు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్...
04-08-2020
Aug 04, 2020, 08:21 IST
దాదాపు 70 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతివ్వడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే  పరిమిత...
04-08-2020
Aug 04, 2020, 08:06 IST
న్యూయార్క్‌ ‌: సంపన్న దేశాలు కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా త్వరలో రానున్న కరోనా వైరస్‌ 100 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోస్‌లను...
04-08-2020
Aug 04, 2020, 07:08 IST
రాయదుర్గం: కోవిడ్‌–19 నుంచి పూర్తిగా కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలని సినీ హీరో నాని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top