మూడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు | Meghalaya, Karnataka, Orissa to new State High Courts | Sakshi
Sakshi News home page

మూడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు

Feb 25 2016 3:40 AM | Updated on Sep 3 2017 6:20 PM

మేఘాలయ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రకటన...

న్యూఢిల్లీ: మేఘాలయ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ అయిన జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీని అదే కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ వినీత్ సరన్‌ను ఒడిశా హైకోర్టు సీజే నియమించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తి అయిన జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డిని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కొలీజియం వ్యవస్థను కేంద్రప్రభుత్వం రద్దుచేశాక గత ఏప్రిల్ నుంచి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అమల్లోకి వచ్చాక ఒక న్యాయమూర్తి సీజేగా నియమించడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement