అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం

Meerut SHOCKER: BJP MLA Sangeet Som Residence Attacked With Bullets And Grenade - Sakshi

ఉత్తర ప్రదేశ్‌ : మీరుట్‌లో బుధవారం అర్థరాత్రి షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్‌ గ్రెనేడ్‌తో సంగీత్‌ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. 

స్పాట్‌లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్‌ టీమ్‌ పరిశీలిస్తుందని మీరుట్‌ ఎస్‌ఎస్‌పీ తెలిపారు. హ్యాండ్‌ గ్రెనైడ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్‌ గేట్‌ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. 

ఎమ్మెల్యే సోమ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్‌ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు.  


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top