
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (డీఎంసీ)లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని (45) కరోనా కబలించింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంలో ఆమె మే 4 తేదీ వరకు పాల్గొన్నారు. అయితే కరోనా లక్షణాలకు కనిపించడంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న తరుణంలోనే ఆదివారం మరణించారు. అయితే మే 3నే ఆమె భర్త కూడా కరోనా కారణంగానే కన్నుమూయడం విషాదం. మరోవైపు ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,542కి చేరింది. మృతుల సంఖ్య 73కి పెరిగింది. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు..)