కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు..

List of Top 10 worst Affected Indian States Of  Corona Virus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వాసుల ప్రాణాలపై కరోనా వైరస్‌ ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దేశంలో ఏమూలనూ వదలకుండా కాశీ నుంచి కన్యాకుమారి వరకు కరోనా వ్యాప్తించింది. ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 60వేల చేరువలో ఉన్నాయి. మరోవైపు మరణాల సంఖ్య 1981కి పెరిగింది. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 50 వరకు మూడు రాష్ట్రాల్లోనే ఉండటం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. దేశంలో ఏయే రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న అంశంపై పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కరోనా కేసులు అత్యధికంగా పది రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి.

దేశంలో కరోనా అత్యంత ప్రభావం గల తొలి పది రాష్ట్రాలు...

1) మహారాష్ట్ర : దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితిని మహారాష్ట్ర ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19063 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 737 మంది మృత్యువాత పడ్డారు.

2) గుజరాత్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7402 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ కారణంగా 449 మంది మరణించారు. కరోనా కేసులు నమోదులో దేశంలో గుజరాత్‌ రెండోస్థానంలో ఉంది. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు)

3) ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కరోనాతో అల్లాడుతోంది. మొన్నటి వరకు తీవ్రమైన వాయు కాలుష్యంతో తల్లడిల్లిన హస్తిన వాసులను కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిజాముద్దీన్‌లో నిర్వహించిన మత ప్రార్థనలను ఢిల్లీతో పాటు యావత్‌ దేశాన్ని వణికించాయి. ఇక ఢిల్లీ సర్కార్‌ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 6318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 66 మంది ప్రాణాలు ఇడిచారు. కేసుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

4) తమిళనాడు : దేశంలో కరోనా కేసు నమోదైన మొదటి నెల వరకూ సురక్షితంగా ఉన్న తమిళనాడును తబ్లిగీ మత ప్రార్థనాలను చుట్టుమట్టాయి. దేశంలో తబ్లిగీలను ద్వారా అత్యంత ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 600 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6009కి చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు.

5) రాజస్తాన్‌ : ఇక రాజస్తాన్‌లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3579 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల శాతం కాస్త ఎక్కువగా ఉండటం ఆందోళనకర విషయం. వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 101 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కోటాలో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను విడదల వారిగా స్వస్థలాలకు పంపించారు. 

6) మధ్యప్రదేశ్‌ : మొదట్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నా..  ఏప్రిల్‌ మాసంలో మధ్యప్రదేశ్‌లో తీవ్రత ఎక్కువైంది. వైద్య అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3341. 200 మంది వైరస్‌ కారణంగా మరణించారు. బాధితులకు మెరగైన వైద్యం అందిస్తున్నప్పటికీ మృతుల సంఖ్యను మాత్రం కట్టడి చేయలేకపోతోంది. అయితే భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ బాధితుల్లో ఇటీవల కొంతమంది కరోనా బారినపడి మరణించడం కలకలం రేపింది. మొత్తం 15 మంది భోపాల్‌ విషవాయువు బాధితులు చనిపోయారు.

7) ఉత్తర ప్రదేశ్‌ : దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కరోనా కేసులు మాత్రం కొంతమేర అదుపులోనే ఉండటం ప్రభుత్వానికి ఊరటినిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3214 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 66 మంది కన్నుమూశారు.

8) ఆంధ్రప్రదేశ్‌ : దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇక మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1930కి చేరగా.. మరణాల సంఖ్య 44కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 999 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు కూడా 1.17 శాతానికి తగ్గింది.

9) పశ్చిమ బెంగాల్‌ : కరోనా కేసుల సంఖ్య విషయంలో తప్పుడు లెక్కలను చూపిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్రం మాత్రం ఇప్పటి వరకు 1678 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 160 మంది మరణించారు. 

10) పంజాబ్‌ : లాక్‌డౌన్‌ను అత్యంత పటిష్టంగా అమలు చేస్తోన్న పంజాబ్‌లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1731 పాజిటి్‌ కేసులు నమోదు కాగా.. 29 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 23:13 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్...
08-05-2021
May 08, 2021, 21:53 IST
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బాబా సెహగల్‌ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....
08-05-2021
May 08, 2021, 20:46 IST
జైపూర్‌: ​కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని శిఖర్‌ జిల్లాలోని...
08-05-2021
May 08, 2021, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై...
08-05-2021
May 08, 2021, 19:32 IST
ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో...
08-05-2021
May 08, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-05-2021
May 08, 2021, 18:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు...
08-05-2021
May 08, 2021, 18:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌...
08-05-2021
May 08, 2021, 17:28 IST
భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60)...
08-05-2021
May 08, 2021, 17:00 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి...
08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:20 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
08-05-2021
May 08, 2021, 15:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర...
08-05-2021
May 08, 2021, 14:55 IST
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల...
08-05-2021
May 08, 2021, 14:04 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 13:56 IST
లండన్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్‌ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి....
08-05-2021
May 08, 2021, 13:10 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top