అనుమానస్ప స్థితిలో ఓ ఎంబిఏ విద్యార్థి మృతిచెందిన ఘటన గ్రేటర్ నోయిడలోని హాస్టల్లో శనివారం వెలుగుచూసింది.
గ్రేటర్ నోయిడా: అనుమానస్పద స్థితిలో ఎంబిఏ విద్యార్థి మృతిచెందిన ఘటన గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్లో శనివారం వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం.. బీహార్కు చెందిన రంజిత్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ రూంలో రంజిత్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి చెప్పారు. దాంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
అతని రూంలో నిద్రమాత్రలు దొరికినట్టు పోలీసులు తెలిపారు. అయితే రంజిత్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యచేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు ఇంకా నమోదు చేయలేదని, రంజిత్ సహాచరులు, మిత్రులను ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.