అలా చేస్తే సర్కార్కు రూ.20 కోట్లు ఆదా! | Marri Shashidhar Reddy explains mallanna sagar issue to rahul gandhi | Sakshi
Sakshi News home page

అలా చేస్తే సర్కార్కు రూ.20 కోట్లు ఆదా!

Jul 14 2016 7:24 PM | Updated on Sep 4 2017 4:51 AM

అలా చేస్తే సర్కార్కు రూ.20 కోట్లు ఆదా!

అలా చేస్తే సర్కార్కు రూ.20 కోట్లు ఆదా!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కలిసి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదాన్ని వివరించారు.

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కలిసి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదాన్ని వివరించారు. గురువారం సాయంత్రం రాహుల్ గాంధీతో మర్రి శశిధర్ భేటీ అయ్యారు. హర్యాణాలో రిజర్వాయర్ లేకుండా జవహార్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహిస్తున్న తీరును రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. హర్యాణాలో ప్రాజెక్టులు సందర్శించిన మర్రి శశిధర్ ఆ వివరాలను రాహుల్ తో చర్చించారు.

ఈ నెల 16న మల్లన్న సాగర్కు వెళ్లనున్న వివరాలతో పాటు మల్లన్న సాగర్, పాములపర్తికి పంపింగ్ చేసి ఇంటెక్ వెల్ పంపులతో సాగునీరు ఇవ్వొచ్చునని, దీని వల్ల రూ.20 కోట్లు ఆదా చేసే అవకాశం ఉందని శశిధర్ పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలని మర్రి శశిధర్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement