ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టులు మృతి | maoists killed in chhattisgarh encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టులు మృతి

Aug 5 2016 8:48 AM | Updated on Oct 9 2018 2:39 PM

ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. దంతేవాడ - బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సర్సఫాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు... పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు.

దీంతో ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు పరారైయ్యారు. పోలీసులకు సంఘటన స్థలంలో  ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement