యోగి కాన్వాయ్‌ ముందు దూకేశాడు | Man jumps in front of UP Chief Minister convoy | Sakshi
Sakshi News home page

Dec 31 2017 9:44 AM | Updated on Oct 8 2018 3:08 PM

Man jumps in front of UP Chief Minister convoy - Sakshi

లక్నో : ఉత్తర ప‍్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ కాన్వాయ్‌ ముందు ఓ వ్యక్తి నిన్న హల్‌ చల్‌ చేశాడు. ఒక్కసారి భద్రతా వాహనాలు ముందు దూకటంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పక‍్కకు లాక్కెల్లారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 

లోక్‌ భవన్‌లో ఓ కార్యక్రమానికి ఆదిత్యానాథ్‌ వెళ్తుండగా ఇది జరిగింది. ఆ వ్యక్తిని సోనెభాంద్రాకు చెందిన శ్యామ్‌జీ మిశ్రా(30)గా పోలీసులు అతన్ని గుర్తించారు. ఇల్లీగల్‌ మైనింగ్‌ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు బీజేపీ నేతలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో శ్యామ్‌జీ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండుసార్లు సీఎంను కలిసినప్పటికీ.. ఈ విషయాన్ని వెల్లడించేందుకు పరిస్థితులు సహకరించలేదంట. అందుకే ఈసారి ఏకాంతంగా కలుసుకోవాలని ప్రయత్నించాడు. 

అయితే సిబ్బంది అతన్ని అనుమతించకపోవటంతో ఇలా చేశానని మిశ్రా చెప్పుకొచ్చాడు. కాగా, అతని గురించి సమాచారం అందుకున్న ఆదిత్యానాథ్‌ అతన్ని కలిసేందుకు పురమాయించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement