చిరుతను కుక్కను కొట్టినట్లు కొట్టాడు! | Man beated Leophard | Sakshi
Sakshi News home page

చిరుతను కుక్కను కొట్టినట్లు కొట్టాడు!

Feb 8 2016 3:06 AM | Updated on Sep 26 2018 6:01 PM

చిరుతను కుక్కను కొట్టినట్లు కొట్టాడు! - Sakshi

చిరుతను కుక్కను కొట్టినట్లు కొట్టాడు!

ఆకలి వేసిందో.. దప్పికేసిందో.. కాని అడవి నుంచి ఓ చిరుత దారి తప్పింది. నేరుగా ఓ స్కూల్‌లోకి ప్రవేశించింది.

ఆకలి వేసిందో.. దప్పికేసిందో.. కాని అడవి నుంచి ఓ చిరుత దారి తప్పింది. నేరుగా ఓ స్కూల్‌లోకి ప్రవేశించింది. ఆదివారం సెలవు దినం కావడంతో దర్జాగా స్కూల్ మొత్తం కలియదిరిగింది. సీసీ కెమెరాలో చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.

వాళ్లు వచ్చి చిరుతను బంధించడానికి విశ్వప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిలో సంజయ్ గుబ్బి అనే వ్యక్తి కాలు, చెయ్యిని తీవ్రంగా కొరికింది. దీంతో కోపంతో రెచ్చిపోయిన సంజయ్ చిరుత అని కూడా చూడకుండా దాన్ని కుక్కను కొట్టినట్లు కొట్టబోయాడు. దెబ్బకు బెదిరిపోయిన చిరుత పారిపోయింది. చివరకు సాయంత్రానికి దాన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని విబ్‌జియార్ పాఠశాలలో జరిగింది.    - బెంగళూరు

Advertisement
 
Advertisement
Advertisement