ప్రధాని భార్యను పలకరించిన మమత

Mamata Banerjee Met Narendra Modi Wife at Kolkata Airport - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌తో మాట్లాడారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు బయలుదేరిన సీఎం మమత కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్‌ కోల్‌కతా నుంచి ధన్‌బాద్‌ వెళ్లేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ‘విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు సీఎం మమత చీర బహూకరించారు’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, మమత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top