
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఐఐటీల్లో బాలికల సంఖ్యను కనీసం 14 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీల్లో చేరే విద్యార్థుల్లో బాలికల కోసం ప్రత్యేక మెరిట్ లిస్ట్ రూపొందించాలని ఈ విద్యాసంస్థలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది 2018–19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
‘ఐఐటీల్లో సాధారణ జాబితా రూపొందించిన అనంతరం బాలికల కోసం ప్రత్యేక జాబితా రూపొందించాలి. ఒకవేళ రెగ్యులర్ మెరిట్ లిస్టులో బాలికల సంఖ్య ఆరు శాతం ఉంటే.. మొత్తం క్యాంపస్‌లో బాలికల సంఖ్య కనీసం 14 శాతం ఉండేలా వెంటనే ఐఐటీలు బాలికలతో కొత్త జాబితాను రూపొందించాలి’ అని ఆ శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది. 2016 కల్లా ఐఐటీల్లో చేరే మహిళల సంఖ్యను 20 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కాగా, ఇప్పటికే ఐఐటీల్లో లింగపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.