ఆ 20 మంది అడ్మిషన్లకు లక్నో వర్సిటీ నో..

Lucknow Versity Denies Admission To Students For Waving Black Flags At CM Yogi - Sakshi

లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ గత ఏడాది లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించినప్పుడు నిరసన తెలిపిన విద్యార్ధులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గతంలో సీఎం రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపిన 20 మంది విద్యార్థులకు లక్నో యూనివర్సిటీ అడ్మిషన్లను నిరాకరించింది. వర్సిటీలోని పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నుంచి లక్నో వర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం నేతలు పూజా శుక్లా, గౌరవ్‌ త్రిపాఠిల నేతృత్వంలో బాధిత విద్యార్థులు నిరాహారదీక్షకు దిగారు.

యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకే వర్సిటీ అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అడ్మిషన్లు ఇచ్చేవరకూ ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరంచారు.

గత ఏడాది సీఎం యోగి ఆదిత్యానాథ్‌ క్యాంపస్‌ను సందర్శించిన సమయంలో నిరసనలకు దిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు బహిష్కరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top