నీట్(జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ఆర్డినెన్సుల స్థానంలో తెచ్చిన రెండు బిల్లులను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది.
న్యూఢిల్లీ: నీట్(జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ఆర్డినెన్సుల స్థానంలో తెచ్చిన రెండు బిల్లులను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. భారత వైద్య మండలి (సవరణ) బిల్లు-2016, దంతవైద్యుల (సవరణ) బిల్లు-2016లను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా వీటి పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల వైద్య విద్యార్థులకు బహుళ సంఖ్యలో ప్రవేశపరీక్షలు రాసే బాధ తప్పుతుందని, అలాగే, క్యాపిటేషన్ ఫీజు వంటి సమస్యలకు ఈ బిల్లులు అంతం పలుకుతుతాయని వాటిని సభలో ప్రవేశపెడ్తూ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
నీట్ వల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షకు సిలబస్‌ను ప్రమాణీకరిస్తామన్నారు. ప్రాంతీయ బాషల్లోనూ నీట్‌ను నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది.