ఏపీలో మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నడుపుతుంది: బాబు
రుణమాఫీ లెక్కల్ని తేల్చమని బ్యాంకులను కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు.
న్యూఢిల్లీ: రుణమాఫీ లెక్కల్ని తేల్చమని బ్యాంకులను కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు. ఢిల్లీ టూర్ ముగించుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. లక్షన్నర రూపాయల వరకూ రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలో ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మోడీని కోరానని బాబు తెలిపారు.
వచ్చే నవంబర్ చివరివారంలో జపాన్ పర్యటనకు వెళ్తున్నానని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ను కోరబోతున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. అక్టోబరు మాసం నుంచి ఆంధ్రాలో రోజంతా కరెంట్ ఇస్తామని, ఆంధ్రలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతుందని చంద్రబాబు తెలిపారు.