రాజ్‌ భవన్‌ వద్ద కలకలం

Leopard sighted at Himachal Pradesh Raj Bhavan - Sakshi

షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ అధికార నివాసం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. రాజ్‌ భవన్‌ ఆవరణలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

సరిగ్గా ఇంటి డోర్‌ ముందు ఉన్న చిరుతను ఓ హోంగార్డు గమనించి ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు అటవీశాఖకు సమాచారం అందించటంతో హుటాహుటిన అక్కడికొచ్చిన వారు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో భవన్‌ చుట్టూ ఎలక్ట్రిక్‌ ఫెంచింగ్‌ను అధికారులు అమర్చారు. అయినప్పటికీ అది లోపలికి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. చిరుత ఇంకా లోపలే ఉందా? దానిని పట్టుకున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top