
నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాలు బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టాయి.
హౌరా : పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న ఉపాధి సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వామపక్ష, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో యువత హౌరా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ హౌరా జిల్లాలోని బెంగాల్ సచివాలయం వరకూ ఈ ప్రదర్శనను 12 వామపక్ష, విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్నాయి. హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో గురువారం ప్రారంభమైన ర్యాలీ తాజాగా హౌరాలో అడుగుపెట్టింది. నిరసనకారులు నబన్న (బెంగాల్ సెక్రటేరియట్)వైపు దారితీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లతోవారిని అడ్డుకుంటున్నారు. నియంత్రణలను ఉల్లంఘించి దూసుకొస్తున్న యువతపై ఖాకీలు లాఠీచార్జి చేస్తూ ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.