కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరాకరించినప్పటికీ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేకు లోక్‌సభ ప్రతిపక్ష నేత సీటును కేటాయించారు. సాధారణం గా డిప్యూటీ స్పీకర్‌కు పక్కన ఉండే ప్రతిపక్ష నేత సీటును ఖర్గేకు కేటాయించినట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. ఖర్గే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విష యం తెలిసిందే. ఇకపై ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎస్పీ నేత ములాయం, జేడీ(ఎస్)అధినేత దేవేగౌడలతో కలసి తొలి వరసలో కూర్చొంటారు.