సీజేఐని కలవనున్న న్యాయశాఖ మంత్రి! | Law minister may meet CJI to discuss govt-judiciary differences | Sakshi
Sakshi News home page

సీజేఐని కలవనున్న న్యాయశాఖ మంత్రి!

Apr 16 2018 4:37 AM | Updated on Apr 16 2018 4:37 AM

Law minister may meet CJI to discuss govt-judiciary differences - Sakshi

న్యూఢిల్లీ: కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పలు అంశాలపై విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై న్యాయశాఖ ఇప్పటికే ఓ నోట్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్‌ కేఎం జోసెఫ్, సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రాలకు ప్రమోషన్‌ కల్పించటం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జిల్లా కోర్టు జడ్జి భట్‌కు హైకోర్టు జస్టిస్‌గా పదోన్నతి  వివాదం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement