మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్..‌ మ‌రిన్ని స‌డ‌లింపులు | Kejriwal Sends Letter To Modi For Delhi Lockdown Suggestions | Sakshi
Sakshi News home page

మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్..‌ మ‌రిన్ని స‌డ‌లింపులు

May 16 2020 9:09 AM | Updated on May 16 2020 9:54 AM

Kejriwal Sends Letter To Modi For Delhi Lockdown Suggestions - Sakshi

ఢిల్లీ :  లాక్‌డౌన్ 4.0 సోమ‌వారం నుంచి అమ‌లు కానున్న నేప‌థ్యంలో కంటైన్‌మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో ఆర్థిక కార్య‌క‌లాపాలు పునః ప్రారంభించేలా అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరుతూ  ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో షాపింగ్ మాల్స్, మెట్రో, ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌ను కొన్ని ష‌రతుల‌తో ప్రారంభిస్తామ‌ని, మాస్కులు, భౌతిక దూరం లాంటి నియ‌మాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా చర్య‌లు తీసుకుంటామ‌ని కేజ్రివాల్ లేఖ‌లో పేర్కొన్నారు. అన్ని రాష్ర్టాల సీఎంల‌తో జ‌రిపిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో భాగంగా లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌పై సీఎంల అభిప్రాయ‌ల‌ను కోరారు.  (లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం )

ఈ నేప‌థ్యంలో కేజ్రివాల్ ప‌లు సూచ‌న‌లు చేశారు. అన్ని షాపింగ్ మాల్స్‌ల‌లో స‌రి- బేసి విధానంతో ఒక‌రోజు కేవ‌లం 33 శాతం మాత్ర‌మే షాపులు తెరిచేలా అనుమ‌తించాల‌ని కోరారు. అన్ని ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు, ఇ-పాస్ ఉన్న‌వారికి మెట్రో ద్వారా ప్ర‌యాణాల‌కు అనుమ‌తిస్తామ‌ని, సామాజిక దూరం పాటించేలా సీటింగ్ అరెంజ్‌మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత ఢిల్లీలో క‌రోనా కేసులు పెరిగే అవ‌కావం ఉంద‌ని, అందుకు అణుగుణంగానే హాస్పిట‌ల్స్‌లో వెంటిలేటర్లు, ఐసీయూ, అంబులెన్సులు మెద‌లైన వాటిని పెంచామని తెలిపారు. అయితే అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్ సెంట‌ర్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం య‌థ‌విదిగా మూసివేయ‌బ‌డ‌తాయి. 

లాక్‌డౌన్ కొన‌సాగించాలా వ‌ద్ద అనే దానిపై సీఎం కేజ్రివాల్..ప్ర‌జ‌ల నిర్ణ‌యానికే వ‌దిలేశారు. త‌మ అభిప్రాయాల‌ను సంబంధిత నెంబ‌ర్‌కు పంపాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో దాదాపు 5 ల‌క్ష‌ల ప్ర‌జానీకం త‌మ విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు పంపించారు. దీనికి అనుగుణంగానే ప్ర‌జ‌ల‌కు అత్య‌వ‌స‌ర‌మైన సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించేలా మోదీకి రాసిన లేఖ‌లో వెల్ల‌డించారు.  (5 ల‌క్ష‌ల స‌ల‌హాల్లో ఎక్కు‌వ వాటి కొర‌కే: కేజ్రీవాల్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement