ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరనున్నారు. కాగా ఈ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు సమాచారం. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు.
మరోవైపు అమ్మకు వీరవిధేయుడైన ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిన్న ఆయనను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.