ప్రతిపక్షాలకు మంచి పని పెట్టారు.. | Jaitley's budget makes opposition job 'tougher': Omar Abdullah | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలకు మంచి పని పెట్టారు..

Feb 29 2016 3:18 PM | Updated on Sep 3 2017 6:42 PM

పార్లమెంట్లో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రతిపక్షాలకు కాస్త మింగుడు పడనిదిగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన  బడ్జెట్ పై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. జైట్లీ సాధారణ బడ్జెట్  ప్రతిపక్షాలకు కాస్త మింగుడు పడనిదిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో దేశంలోని సంపన్నులపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్న ఆయన... బడ్జెట్ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు కాస్త ఎక్కువ పనే పెట్టారన్నారు.

కేంద్ర బడ్జెట్ 2016-17 సూటూ బూటూ ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని, అరుణ్ జైట్లీ చాలా తెలివిగా, కాస్త పటిష్టంగా బడ్జెట్ ను రూపొందించి విపక్షాల గొంతులో వెలక్కాయ పడేలా చేశారని అన్నారు. మొదటిసారిగా బడ్జెట్ పై స్పందించిన ఒమర్ అబ్దుల్లా ఈసారి సాధారణ బడ్జెట్ పై అభిప్రాయాలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement