బాలికపై రేప్.. నిందితుడి కొడుకుతో పెళ్లి! | Jaipur: minor rape victim ordered to wed accused's son | Sakshi
Sakshi News home page

బాలికపై రేప్.. నిందితుడి కొడుకుతో పెళ్లి!

Sep 6 2013 6:12 AM | Updated on Nov 6 2018 4:56 PM

ఓ నలభై ఏళ్ల దుర్మార్గుడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కుల పంచాయతీకి వచ్చింది. అన్నీ పరిశీలించిన మీదట.. ఆ బాలికను నిందితుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పంచాయతీ తీర్పు చెప్పింది.

జైపూర్: ఓ నలభై ఏళ్ల దుర్మార్గుడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసు కుల పంచాయతీకి వచ్చింది. అన్నీ పరిశీలించిన మీదట.. ఆ బాలికను నిందితుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పంచాయతీ తీర్పు చెప్పింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవ్‌పుర గ్రామం ఈ దారుణానికి వేదికైంది.
 
  పక్షం రోజుల కిందట కైలాశ్(40) అనే వ్యక్తి.. తమ సమీపంలో నివసించే బాలికను ఓ గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడని, బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి బదులు ఇలా కుల పంచాయతీని ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. దీంతో బాధిత బాలికను కైలాశ్ చిన్న కుమారుడు(8) పెళ్లి చేసుకోవాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దీనికి రెండు వర్గాల వారూ అంగీకరించలేదు. దీనిపై నిందితుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు బుధవారంనాడు ఆ బాలికపై కైలాశ్ మరోసారి అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయం కొందరు సామాజిక కార్యకర్తలకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కైలాశ్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement