చంద్రయాన్‌-3 మిషన్‌కు శ్రీకారం

ISRO Chief K Sivan Says Work On Chandrayaan Has Started   - Sakshi

బెంగళూర్‌ : చంద్రయాన్‌ 3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్‌ కే శివన్‌ బుధవారం వెల్లడించారు. చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా ఏదోఒక రోజు ఇది సాకారమవుతుందని అన్నారు. ఇక చంద్రయాన్‌ 3 ల్యాండర్‌, క్రాఫ్ట్‌ ఖర్చు దాదాపు రూ 250 కోట్లు కాగా, లాంఛ్‌కు రూ 350 కోట్ల వ్యయమవుతుందని శివన్‌ వెల్లడించారు.

చంద్రయాన్‌–2లో మాదిరిగానే చంద్రయాన్‌–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉంటాయని అన్నారు. చంద్రయాన్‌–2లో ఆర్బిటర్‌ మిషన్‌ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్‌–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. మరోవైపు గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్‌ శర్మ రష్యన్‌ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్‌లోనే భారత్‌ నుంచి వెళతారని ఆయన తెలిపారు.

చదవండి : వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top