
సినిమాల్లో టైమ్ మిషన్ లోకాన్ని చూసి ‘మనకీ ఒకటి ఉంటే బాగుండేది’ అని అనుకున్నారా? అయితే, ఈసారి శాస్త్రవేత్తలు నిజంగానే టైమ్‌ను వెనక్కి తిప్పేశారు! అది కూడా ఒక్క సెకను. ఈ అద్భుతం రష్యా, అమెరికా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కలయికతో సాధ్యమైంది. ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్‌పై ప్రత్యేక అల్గారిథమ్ వాడి, ఒక కణం స్థితిని రివైండ్ చేసి, మునుపటి స్థితికి తీసుకెళ్లగలిగారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రపంచంలో టైమ్ ఒకే దిశలో ముందుకు వెళ్తుంది. కాని, క్వాంటమ్ లోకంలో మాత్రం వేరే నియమాలు వర్తిస్తాయి. అవే ఒకటి సూపర్‌పోజిషన్ , అంటే ఒకే సమయంలో కణం రెండు స్థితుల్లో ఉండటం.
రెండు ఎంటాంగిల్‌మెంట్, అంటే రెండు కణాలు దూరంలో ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపటం. ఇవన్నీ మ్యాజిక్‌లా అనిపించే కాన్సెప్ట్‌లు. వీటిని ఉపయోగించే శాస్త్రవేత్తలు టైమ్‌ని ‘ఒక్క సెకను వెనక్కి’ నెట్టగలిగారు. ఇప్పుడిది చిన్న అంచనా ప్రయోగమే అయినా, ‘పోయిందనుకున్న సమాచారం కూడా తిరిగి వస్తుంది’ అని ఇది రుజువు చేసింది. క్వాంటమ్ కంప్యూటర్లకు ఇది గోల్డెన్ ఆప్షన్ . ఎందుకంటే భవిష్యత్తులో డేటా రికవరీ, ఎర్రర్ కరెక్షన్ , సిస్టమ్ స్టేబిలిటీ అన్నీ సులభం కానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా అయితే, త్వరలోనే టైమ్‌కి రివైండ్ బటన్ వచ్చే రోజులు కూడా రానున్నాయన్నమాట!