మరో వివాదంలో ములాయం | IPS officer Amitabh Thakur releases Mulayam's purported audio threatening him | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ములాయం

Jul 11 2015 12:35 PM | Updated on Sep 3 2017 5:19 AM

మరో వివాదంలో ములాయం

మరో వివాదంలో ములాయం

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తనను బెదిరిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ములాయం తనను బెదిరిస్తున్నారని ఐజీ ర్యాంక్ ఐపిఎస్ అధికారి అమితాబ్ థాకూర్ ఫిర్యాదు చేశారు.

లక్నో:  సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్  యాదవ్ మరోసారి  చిక్కుల్లో పడ్డారు. ములాయం  తనను బెదిరిస్తున్నారని ఓ సీనియర్  ఐపీఎస్  అధికారి ఆరోపిస్తున్నారు.  పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ములాయం తనను బెదిరిస్తున్నారని ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన శనివారం విడుదల చేశారు. దీంతో ఎస్పీ సుప్రీం  వివాదంలో ఇరుక్కున్నారు.  

మరోవైపు ఐపీఎస్ అధికారి ఆరోపణలను ఆపార్టీ సీనియర్ నాయకుడు డీసీ రాయ్ ఖండించారు.  ములాయం లాంటి సీనియర్ నాయకులపై ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని అన్నారు. ములాయం తన గత 30 ఏళ్ల రాజకీయ చర్రితలో ఎవరినీ  బెదిరించిన దాఖలాలు లేవనీ,  ఈ ఆరోపణలు అవాస్తవం  కావచ్చని  అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement