దళిత, ఓబీసీలపైనే బీజేపీ ఆశలు

Infiltrators will be thrown out, says Amit Shah - Sakshi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలన్నీ ఏకమవుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగానే.. దళిత, ఓబీసీ ఓటు బ్యాంకుతోపాటు హిందుత్వ అజెండాపై దృష్టిపెట్టింది. దళితులతోపాటు వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలిచేందుకు బిల్లులను తీసుకొస్తున్న బీజేపీ.. వలసదారులను అడ్డుకోవడంలో చిత్తశుద్ధి తమకే ఉందంటూ హిందుత్వ ఓటర్లను ఆకర్షించనుంది. ఇదే ఈశాన్యరాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు సంపాదించిపెడుతుందని  భావిస్తున్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఈ విషయంలో విపక్షాలను ఇరుకున పెట్టేలా అస్సాం ఎన్నార్సీని ‘జాతీయ భద్రత’తో ముడిపెడుతున్నారు. దళిత, ఓబీసీలకు బలమిచ్చే బిల్లులను తీసుకురానుంది. దళితులపై సుప్రీం ఇచ్చిన తీర్పును విభేదిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లు మళ్లీ ఆ వర్గంలో బీజేపీపై సానుకూలతను కలగజేస్తుందని పార్టీ భావిస్తోంది. ఓబీసీ కమిషన్‌ కు రాజ్యాంగ హోదా ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులతో సమానంగా ఈ కమిషన్‌ కు అధికారాలు కల్పించింది. ఈ నిర్ణయం ఓబీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధిని నిరూపిస్తుందని పార్టీ నేతలంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top