విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు | Indigo Flight Make Emergency Landing In Mumbai | Sakshi
Sakshi News home page

విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు

Jul 28 2016 11:51 AM | Updated on Sep 4 2017 6:46 AM

విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు

విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు

దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement