ఎవరెస్టు నుంచి భారతీయుల తరలింపు | Indians safely brought down to Everest Base Camp | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు నుంచి భారతీయుల తరలింపు

Apr 28 2015 6:27 PM | Updated on Sep 3 2017 1:02 AM

ఎవరెస్టు పర్వతంపై చిక్కకుపోయిన భారతీయులను క్షేమంగా బేస్ క్యాంప్నకు తరలించారు.

న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతంపై చిక్కకుపోయిన భారతీయులను క్షేమంగా బేస్ క్యాంప్నకు తరలించారు. శనివారం సంభవించిన భూకంపం ప్రభావంతో ఎవరెస్టు క్యాంప్ 1, 2 వద్ద పర్వతారోహకులు చిక్కుకుపోయారు. హెలికాప్టర్ల సాయంతో వీరిని బేస్ క్యాంప్నకు తరలించినట్టు ఓ అధికారి తెలిపారు.  వీరిలో పర్వాతరోహకులు, విదేశీయులున్నట్టు చెప్పారు.
 

భారత్కు చెందిన మూడు బృందాలు ఎవరెస్టు అధిరోహణకు వెళ్లాయి. మరికొందరు విదేశీయులు కూడా వెళ్లారు. శనివారం భూప్రకంపల కారణంగా క్యాంప్ 1, 2 ల వద్ద సుమారు 30 నుంచి 40 మంది చిక్కుకుపోయారు. ఓ బృందం నేపాల్ రాజధాని కాఠ్మండుకు చేరింది. మిగిలిన రెండు బృందాలు బేస్ క్యాంప్ వద్ద ఉన్నాయి. వీరిని న్యూఢిల్లీకి ఎప్పుడు తరలిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement