కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!

Indian Women With Covid 19 At Higher Risk Of Death Than Men - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కరోనా బారిన పడిన వారిలో స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా మరణిస్తున్నారని మొన్నటి వరకు అంతర్జాతీయ విశ్లేషణలు తెలియజేశాయి. భారత్‌లో ఆ విశ్లేషణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన భారతీయ మహిళల్లో మృతుల సంఖ్య 3.3 శాతం ఉండగా, పురుషుల్లో మృతుల సంఖ్య 2.9 శాతం ఉంది. కరోనా బారిన పడిన మహిళల్లో 40 నుంచి 49 మధ్య వయస్కులే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మృతుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఈ వయస్కులే. మిగతా వయస్కుల్లో స్త్రీలు ఎంత మంది మరణిస్తున్నారో, పురుషులు కూడా దాదాపు అంతే సంఖ్యలో మరణిస్తున్నారు. (క‌రోనా: రెమ్డిసివిర్ మొద‌ట ఆ అయిదు రాష్ట్రాల‌కే)

కరోనా బారిన పడుతున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. అందుకని మొత్తంగా మరణాల సంఖ్యలో కూడా పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2020, జనవరి 30, ఏప్రిల్‌ 30, జూన్‌ నెలాఖరు వరకు సేకరించిన డేటా ప్రకారం కరోనా వైరస్‌ వైద్య పరీక్షలు నిర్వహించిన పురుషుల్లో 3.8 శాతం మందికి పాజిటివ్‌ రాగా, మహిళల్లో 4.2 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా బారిన పడుతున్న వారిలో మహిళలు తక్కువగా, పురుషులు ఎక్కువగా ఉండడానికి సామాజిక కారణాలుకాగా, మృతుల్లో మహిళలు ఎక్కువగా ఉండడానికి ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. 

పురుషులు మిత్రుల వెంట తరచుగా విందు, వినోద కార్యక్రమాలకు హాజరవుతుండడం, పబ్‌లకు , బార్లకు వెళ్లడం, సామూహికంగా సిగరెట్లు తాగడం లాంటి సామాజిక కారణాల వల్ల పురుషులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. స్త్రీలలో  ఎక్కువ మంది ఇళ్లకు పరిమితం అవడం వల్ల వారు ఎక్కువగా మృత్యువాత పడడం లేదు. అయితే కరోనా బారిన పడిన భారతీయ మహిళల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం పౌష్టికాహార లోపం, బలహీనతలే కారణం. కొంత మేరకు కరోనా బాధితుల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పీడితులు ఉండడం కూడా ఓ కారణం. భారత్‌లోని స్త్రీలలో 15–49 మధ్య వయస్కుల్లో 53.1 శాతం పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారని, అదే పురుషుల్లో, అదే వయస్కుల్లో 22. 5 శాతం మంది బాధ పడుతున్నారని ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ తెలియజేస్తోంది. (పతంజలి ‘కరోలిన్‌’పై పెను దుమారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top