భారత్లోనూ సహజ వాయువుతో నడిచే రైళ్లు త్వరలో రానున్నాయి. ఇంధనంగా ప్రస్తుతం వాడుతున్న డీజిల్కు బదులు సహజ వాయువును ఉపయోగించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే చెప్పారు.
భారత్లోనూ సహజ వాయువుతో నడిచే రైళ్లు త్వరలో రానున్నాయి. ఇంధనంగా ప్రస్తుతం వాడుతున్న డీజిల్కు బదులు సహజ వాయువును ఉపయోగించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే ఈ మేరకు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే శాఖ ఈ మేరకు ప్రతిపాదించినట్టు తెలిపారు.
సహజ వాయువు వాడటం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఖర్గే చెప్పారు. దీనివల్ల వాతావరణాన్ని కలుషితం చేసే కర్బన రసాయనాలు వెలువడకుండా నియంత్రించవ్చని తెలిపారు. ఇక కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల మేర లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు డబ్లింగ్ పనులు, కొత్త రైళ్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన రూపొందించినట్టు ఖర్గే చెప్పారు.