2023లో మొదటి దశ ప్రైవేట్‌ రైళ్లు

Indian Railways begins process for entry of private trains - Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో ప్రైవేట్‌ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి  151 ప్రైవేట్‌ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్‌ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్‌ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్‌ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు.  151 ప్రైవేట్‌ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని  అంచనా వేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top