కూలిన కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్ | Indian Coast Guard helicopter crashes in Maharashtras Nandgaon | Sakshi
Sakshi News home page

కూలిన కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్

Mar 10 2018 4:12 PM | Updated on Oct 8 2018 5:45 PM

Indian Coast Guard helicopter crashes in Maharashtras Nandgaon - Sakshi

ఇండియన్ కోస్ట్ గార్డ్‌ హెలికాప్టర్ (ఫైల్‌)

సాక్షి, ముంబయి: ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మురుద్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. అయితే హెలికాప్టర్‌లోని వారంతా క్షేమంగా ఉన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారని, ఓ మహిళకు మాత్రం గాయాలైనట్లు తెలిపారు. హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. అది గాల్లో ఉన్నప్పుడే సాంకేతిక లోపం ప్రమాదం సంబవించినట్లు సమాచారం.  సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement