వంతెనపై చిక్కుకున్న జాలర్లు.. ఎయిర్‌ఫోర్స్‌ సాహసం!

Indian Air Force Rescue Of Two People At Tawi River In Jammu Kashmir - Sakshi

జమ్మూ : భారత వైమానిక దళం చూపిన దైర్య సాహసాలకు అందరూ శభాష్‌ అంటున్నారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుంండటంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని తావి నదిలోకి భారీ వరద చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తుంది. అదే సమయంతో నదిలోకి  చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు అకస్మాత్తుగా నదీ ప్రవాహం పెరగడంతో సమీపంలోని నిర్మాణంలో ఉన్న వంతెనపై చిక్కుకుపోయారు. నలుగురిలో ఇద్దరు ఎలాగోలా కష్టపడి నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మిగతా ఇద్దరు అలాగే ఉండిపోయారు. దీంతో తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు.

వెంటనే స్పందించిన భారత వైమానిక దళం రెస్య్కూ ఆపరేషన్‌ మొదలుపెట్టింది. హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్లి.. వంతెనపై బిక్కుబిక్కుమంటున్న ఆ ఇద్దరిని రక్షించింది. ఆపద సమయంలో స్పందించి వీరోచితంగా ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఎయిర్‌ ఫోర్స్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక, దేశంమంతా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కేరళతో పాటు ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top