మోదీ మళ్లీ వస్తే.. ఇక ఎన్నికలు ఉండవ్‌!  | India may not have elections if Modi re elected may go China way | Sakshi
Sakshi News home page

మోదీ మళ్లీ వస్తే.. ఇక ఎన్నికలు ఉండవ్‌! 

Mar 20 2019 2:43 AM | Updated on Mar 20 2019 2:43 AM

India may not have elections if Modi re elected may go China way - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నికైతే చైనా, రష్యాల్లో మాదిరిగా భారత్‌లోనూ ఎన్నికలు ఇకపై జరగకపోవచ్చని కాంగ్రెస్‌ నేత, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మున్ముందు దేశంలో ఎన్నికలు జరుగుతాయన్న గ్యారెంటీ లేదు. చైనా, రష్యాలో మాదిరిగా ఒక వేళ ఎన్నికలు జరిగినా అదే పార్టీ, అదే వ్యక్తి రాష్ట్రపతి లేదా ప్రధాని అవుతారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మోదీ హయాంలో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయాయి.

అధికారం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తారు. పాకిస్తాన్‌తో యుద్ధానికైనా ఆయన వెనుదీయరని ప్రజలు భావిస్తున్నారు’ అని విమర్శించారు. మోదీ మనసులో ఏమున్నదీ అమిత్‌షాకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ‘మోదీజీ బాలీవుడ్‌లో ఉంటే ప్రసంగ పాటవం, నటనా చాతుర్యంతో అంతర్జాతీయంగానూ కొత్త గుర్తింపు తెచ్చుకుని ఉండేవారు’ అని గహ్లోత్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో సహనం అవసరమంటూ ఆయన.. బీజేపీ నేతలకు సహనం లేదనీ, ప్రశ్నించడాన్ని వారు తట్టుకోలేరని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement