వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు | India is ranked in aviation safety category | Sakshi
Sakshi News home page

వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు

Apr 9 2015 1:18 AM | Updated on Sep 3 2017 12:02 AM

వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు

వైమానిక భద్రతలో భారత్‌కు కేటగిరీ-1 ర్యాంకు

భారత వైమానికరంగం భద్రత విషయంలో కేటగిరీ-1 ర్యాంకుకు చేరుకున్నట్లు అమెరికాకు చెందిన విమానయాన పర్యవేక్షణ

న్యూఢిల్లీ: భారత వైమానికరంగం భద్రత విషయంలో కేటగిరీ-1 ర్యాంకుకు చేరుకున్నట్లు  అమెరికాకు చెందిన విమానయాన పర్యవేక్షణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. దీంతో దేశీయ వియానయాన సంస్థలు తమ సేవలను విస్తరించడానికి మార్గం సుగమం అయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విఫలం కావడంతో 14 నెలల క్రితం భారత్ ర్యాంకును కేటగిరీ-2కి తగ్గించారు.

అమెరికా ట్రాన్స్‌పోర్టు సెక్రటరీ ఆంథోనీ ఫాక్స్ బుధవారం ఇక్కడ ఈ విషయాన్ని వెల్లడిస్తూ భారత్ తన ర్యాంకును పునరుద్ధరించుకోవడానికి తీవ్రంగా శ్రమించిందన్నారు. పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో జరిగిన సమావేశం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement