గూగుల్‌కు భారత్ ఝలక్ | India denies Google's Street View | Sakshi
Sakshi News home page

గూగుల్‌కు భారత్ ఝలక్

Jun 10 2016 2:52 AM | Updated on Sep 4 2017 2:05 AM

గూగుల్‌కు భారత్ ఝలక్

గూగుల్‌కు భారత్ ఝలక్

గూగుల్ స్ట్రీట్ వీక్షణంలో భారత్‌లోని పలు ప్రదేశాలు చేర్చాలనే ఆలోచనలకు భారత ప్రభుత్వం బ్రేకులు వేసింది.

న్యూఢిల్లీ: గూగుల్ స్ట్రీట్ వీక్షణంలో భారత్‌లోని పలు ప్రదేశాలు చేర్చాలనే ఆలోచనలకు భారత ప్రభుత్వం బ్రేకులు వేసింది. గూగుల్‌కు అనుమతులు ఇస్తే రక్షణ పరమైన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఈ ప్రతిపాదనను హోం శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2008లో జరిగిన ముంబై దాడులు ఇలానే చోటుచేసుకున్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జియోస్పాటికల్ ఇన్‌ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్ 2016 అమలు అయితే ఇంటర్‌నెట్ సంబంధిత పలు సమస్యలకు చిక్కుముడులు విప్పొచ్చని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. గూగుల్ స్ట్రీట్ ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలు 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ఇది అమెరికా, కెనడా, యూరప్‌లలో వినియోగంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement