
న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌త్లో ఉపాధి కోల్పోయిన తమపౌరుల ఖాతాలకు నగదు బదిలీచేశామని, నగదుబదిలీలో భారత్ కోరితే సాయానికి సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్లను భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. తమ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ(రూ.20 లక్షల కోట్లు) పాకిస్తాన్ వార్షిక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో సమానమని గుర్తుచేసింది. ‘సొంత పౌరులకు నగదు ఇవ్వడం కంటే బయటి దేశాల్లోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడమే పాకిస్తాన్‌కు బాగా తెలుసు. ఇమ్రాన్ ఖాన్ కొత్త సలహాదారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సరైన సమాచారం తెలుసుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. (భారత్‌తో నగదు బదిలీకి సిద్ధం: పాక్ ప్రధాని)