కాబుల్‌ మృతులకు భారత్‌ నివాళులు | India condemns terror attacks in Kabul | Sakshi
Sakshi News home page

కాబుల్‌ మృతులకు భారత్‌ నివాళులు

Mar 2 2017 2:01 PM | Updated on Nov 6 2018 8:35 PM

అప్ఘనిస్తాన్‌లో ముష్కరులు బుధవారం జరిపిన దాడుల్లో మృతి చెందినవారికి భారత విదేశాంగ శాఖ నివాళులర్పించింది.

న్యూఢిల్లీ: అప్ఘనిస్తాన్‌లో ముష్కరులు బుధవారం జరిపిన దాడులలో మృతి చెందినవారికి భారత విదేశాంగ శాఖ నివాళులర్పించింది. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మానవ బాంబులతో ముష్కరులు అప్ఘన్‌ రాజధాని కాబుల్‌లో రెండుసార్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 43 మం‍ది గాయపడ్డారు. భారత్‌ కూడా ఉగ్ర బాధిత దేశమని, ఉగ్రవాద నిర్మూలనకు అప్ఘనిస్తాన్‌తో కలిసి పోరాడతామని విదేశాంగ శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement