13 రోజుల్లోనే వేయి ఉద్యోగాలు | In 13 days Thousand Jobs | Sakshi
Sakshi News home page

13 రోజుల్లోనే వేయి ఉద్యోగాలు

Dec 17 2016 4:24 AM | Updated on Sep 4 2017 10:53 PM

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరుగుతున్న తొలిదశ ప్రాంగణ నియామకాల్లో కేవలం 13 రోజుల్లోనే వేయి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.

కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరుగుతున్న తొలిదశ ప్రాంగణ నియామకాల్లో కేవలం 13 రోజుల్లోనే వేయి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. 44 ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు సహా దేశవిదేశాల నుంచి సుమారు 175 కంపెనీలు ఈసారి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఏడు పీఎస్‌యూలు 44 మందిని నియమించుకున్నాయి. కోల్‌ఇండియా అత్యధికంగా 26 మందిని ఎంపికచేసుకుంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, స్ప్రింక్లర్,  డెల్టాలాంటి అంతర్జాతీయ కంపెనీలు 24 మందికి ఉద్యోగాలిచ్చాయి. ఈ ఏడాది కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎక్కువ మంది ఎంపికయ్యారని ఐఐటీ కెరీర్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం చైర్మన్ ప్రొ.దేవశిశ్‌ దేవ్‌ చెప్పారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఈ రంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 20 శాతం పెరిగిందని, మొత్తంగా శాంసంగ్‌ అత్యధికంగా 47 మందిని తీసుకుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement