ఏడాదికి రూ. 91 లక్షల జీతం!! | IIT Kharagpur Student Offered 91 Lakh Package | Sakshi
Sakshi News home page

ఏడాదికి రూ. 91 లక్షల జీతం!!

Nov 5 2014 1:09 PM | Updated on Sep 2 2017 3:51 PM

ఏడాదికి రూ. 91 లక్షల జీతం!!

ఏడాదికి రూ. 91 లక్షల జీతం!!

ఐఐటీ ఖరగ్పూర్లో చదివిన ఓ విద్యార్థికి ఏకంగా ఏడాదికి 91 లక్షల ప్యాకేజి వచ్చింది.

ఐఐటీ... ఎలాగైనా ఇక్కడ ఇంజనీరింగ్ చదవాలన్నది చాలామంది ఆశ. అలా చదివితే చాలు.. బ్రహ్మాండమైన జీతాలు కూడా వస్తాయని అంటారు. అలాగే అయ్యింది. ఐఐటీ ఖరగ్పూర్లో చదివిన ఓ విద్యార్థికి ఏకంగా ఏడాదికి 91 లక్షల ప్యాకేజి వచ్చింది. ఇది కూడా ఇంకా అధికారికంగా ప్లేస్మెంట్లు ప్రారంభం కాకముందే.

మొత్తం 125 మంది విద్యార్థులకు ఇలా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 20 శాతం ఎక్కువ. గూగుల్, మౌంటెన్ వ్యూ, ఫేస్బుక్, వర్క్స్ అప్లికేషన్, ష్లంబర్గర్ లాంటి అనేక ఎంఎన్సీల నుంచి లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చాయి. తుది విడత ప్లేస్మెంట్ల కార్యక్రమం డిసెంబర్ ఒకటోతేదీన మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement