ప్రేమ చిహ్నంతో.. ఐఏఎస్‌ లవ్‌బర్డ్స్‌

IAS Couples Aamir And Tina Dabi Visit Taj Mahal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్‌ ప్రేమపక్షులు అమీర్‌ ఉల్‌ షఫీ, టీనా దాబీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో వివాదాల నడుమ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహాల్‌తో సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. వారు దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ శాశ్వతమైన ప్రేమకు అద్భుతమైన శ్మారక చిహ్నమైన తాజ్‌మహాల్‌ వద్ద నా హుబ్బీతో’’ అని వారు షేర్‌ చేసిన ఫోటోలకు కామెంట్‌ పెట్టారు. వారి విహహం అనంతరం తొలిసారి విజిటింగ్‌కు బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. తాజ్‌ మహాల్‌, ఫతేపూర్‌ సిక్రీ వంటి ప్రదేశాలను వారు సోమవారం సందర్శించారు.

2015 సివిల్స్‌ టాపరైన టీనా దాబీ తన జూనియర్‌ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్‌ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్‌ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. అయినా అవేవి పట్టించుకుకోని ఆ జంట 2018లో అమీర్‌ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. 


 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top