ఆ ఐఏఎస్‌ జంట పెళ్లి ఖర్చు రూ.500! | IAS Couple Spends Just Five Hundred Rupees For Wedding In Karnataka | Sakshi
Sakshi News home page

ఆ ఐఏఎస్‌ జంట పెళ్లి ఖర్చు రూ.500!

Feb 27 2019 8:49 AM | Updated on Feb 27 2019 10:44 AM

IAS Couple Spends Just Five Hundred Rupees For Wedding In Karnataka - Sakshi

ఐఏఎస్‌ జంట హెప్సిబారాణి- ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌

నిరాండబరంగా పెళ్లి చేసుకున్న కర్ణాటక ఐఏఎస్‌ జంట

సాక్షి, బెంగళూరు : వాళ్లిద్దరు ఐఏఎస్‌ అధికారులు. పరస్పరం ప్రేమించుకొని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్న వారికి ఆదర్శంగా నిలిచి, సమాజానికి కొత్త సందేశాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఐఏఎస్‌ అధికారిణి హెప్సిబారాణి ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌ బాగల్‌ కోట జిల్లా కృష్ణా ఎగువ ప్రాజెక్టు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి... సోమవారం హుబ్లీలోని మినీ విధానసౌధలో బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

అనంతరం నూతన జంట మాట్లాడుతూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేస్తూ పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టామనే విషయం పరిగణనలోకి రాదని, నూతన దంపతులు భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా గడపడమే  ముఖ్యమన్నారు. కాగా ఈ పెళ్లికి  రూ.500 మాత్రమే ఖర్చు అయినట్లు వారి బంధువులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement