కార్గిల్‌ సమయంలో కూడా ఎల్‌వోసీ దాటని ఐఏఎఫ్‌

IAF Crossed LOC First Time Since 1971 War - Sakshi

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన భారత్‌.. అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించింది. పాక్‌ భూభాగంలోకి దుసుకెళ్లిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నియంత్రణ రేఖను దాటి జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించి భారత్‌ సత్తా చాటింది.

అయితే కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా భారత వైమానిక దళం ఎల్‌వోసీ దాటలేదు. 1971 ఇండో-పాక్‌ యుద్దం తరువాత తొలిసారి ఐఏఎఫ్‌.. ఎల్‌వోసీ దాటి దాడులు జరిపింది. 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో వెయ్యి కిలోల బాంబులను ఉగ్రస్థావరాలపై జారవిడిచింది. ఈ రోజు ఐఏఎఫ్‌ ఎల్‌వోసీ పరిసరాల్లోని చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ పాంతాలపైనా మాత్రమే కాకుండా.. పాక్‌ భూభాగం బాల్కోట్‌లోని ఉగ్రస్థావరాలపై ఐఏఎఫ్‌ పంజా విసిరింది. 

అయితే కార్గిల్‌ సమయంలో కూడా ఎల్‌వోసీ దాటని ఐఏఎఫ్‌.. నేడు ఉగ్రమూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి బలమైన కారణాలే కనబడుతున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పాక్‌ ఉదాసీనంగా వ్యవహరించడం, పుల్వామా ఉగ్రదాడిపై పాక్‌ వైఖరి, అంతేకాకుండా జైషే మహమ్మద్‌ భారత్‌లో పుల్వామా లాంటి మరిన్ని దాడులకు పాల్పడనుందనే సూచనల నేపథ్యంలో ఐఏఎఫ్‌ ఈ దాడులు జరిపినట్టు సమాచారం. శాంతి కోసం ఉగ్రసంస్థలకు అన్ని రకాల సాయాన్ని నిలిపివేసి.. శాంతి కోసం పాటుపడాలని కోరిన స్పందన లేకపోవడంతో.. దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీచేసేందుకే భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పాక్‌ పట్టించుకోలేదు...అందుకే దాడులు

సర్జికల్‌ స్ట్రైక్‌ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top