మోదీ గుహకు భారీ డిమాండ్‌ | A Huge Demand from Pilgrims for Modi Meditation Cave | Sakshi
Sakshi News home page

మోదీ గుహకు భారీ డిమాండ్‌

Jun 29 2019 8:03 PM | Updated on Jun 29 2019 8:12 PM

A Huge Demand from Pilgrims for Modi Meditation Cave - Sakshi

డెహ్రాడూన్‌: గత నెల ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ధ్యా నం చేసిన గుహకు ఇప్పుడు భక్తులు, యాత్రికుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే జులై నెలంతా బుక్కైపోగా, ఆగస్ట్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో కూడా కొన్ని తేదీలకు  అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ఈ గుహ కేదార్‌నాథ్‌ దేవాలయానికి ఒక కిలోమీటర్‌ దూరంలో ఉంది. మే 18న ప్రధాని ఈ గుహను సందర్శించిన తర్వాత ఇప్పటి వరకు ఈ గుహ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని జనరల్‌ మేనేజర్‌ బీ ఎల్‌ రానా వెల్లడించారు. ఈ గుహలో ధ్యానం చేయాలనుకునేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే అనుమతిస్తారు. గుహ రుసుము ఒకరోజుకు 990 రూపాయలు.  అంతేకాక, అలాంటి గుహలు ఏర్పాటు చేయడానికి అక్కడే మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు రుద్రప్రయాగ్‌ కలెక్టర్‌ తెలిపారు.గత ఐదేళ్లలో ప్రధాని మోదీ నాలుగు సార్లు కేదార్‌ నాథ్‌ను దర్శించుకున్నారు. దాంతో పాటు అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడంతో యాత్రికుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు ఏడున్నర లక్షల మంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. గత నెల 9న తెరుచుకున్న ఈ ఆలయం అక్టోబర్‌ వరకు తెరచి ఉంటుంది. అప్పటి వరకు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement